గుర్రపు స్వారితో రౌడీ రచ్చ : త్వరలోనే సొంతం చేసుకుంటాను

గుర్రపు స్వారితో రౌడీ రచ్చ : త్వరలోనే  సొంతం చేసుకుంటాను

విజయ్ దేవరకొండ గుర్రాన్ని కొనుక్కోవాలని చూస్తున్నాడట. తనకుగుర్రాలు అంటే చాలా ఇష్టమని, త్వరలోనే ఓ గుర్రాన్ని సొంతం చేసుకుంటాను అని విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. వెగాస్‌లో ప్రస్తుతం గుర్రపు స్వారీ చేస్తూ విజయ్ బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తోన్న లైగర్ సినిమా కోసం వెగాస్‌లో అడుగుపెట్టాడు. మైక్ టైసన్‌తో కొన్ని కీలక సీన్లు పూరి జగన్నాథ్ ప్లాన్ చేశాడు. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్, అనన్య పాండే కాంబినేషన్‌లో ఉండే సీన్లను పూరి తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హార్స్ రైడింగ్ కూడా చేసేట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో అనన్య పాండే, విజయ్ దేవరకొండ ఇద్దరూ కూడా హార్స్ రైడ్ చేస్తూ కనిపించారు. మామూలుగా కొందరికి హార్స్ రైడింగ్ అనే పిచ్చి కూడా ఉంటుంది.

తెలుగు హీరోల్లో చాలా మందికి హార్స్ రైడింగ్ వచ్చు. చిరంజీవి, బాలకృష్ణ వంటి వారికి హార్స్ రైడింగ్ తెలుసు. ఇక రామ్ చరణ్‌కు అయితే చిన్నప్పటి నుంచి హార్స్ రైడింగ్ ఇష్టం. బాల్యం నుంచి కూడా అందులో ట్రైనింగ్ తీసుకున్నాడు. మగధీర సినిమాలో వాడిన గుర్రాన్ని రామ్ చరణ్ సొంతంగా ఉంచేసుకున్నాడు. కాజల్, బాద్ షా వంటి గుర్రాలు తన ఫాం హౌస్‌లో ఉంటాయి. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా గుర్రాన్ని కొనుక్కోవాలని చూస్తున్నాడట. తనకుగుర్రాలు అంటే చాలా ఇష్టమని, త్వరలోనే ఓ గుర్రాన్ని సొంతం చేసుకుంటాను అని విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. విజయ్ చేతిలో ప్రస్తుతం ఒక్క లైగర్ సినిమానే ఉంది. సుకుమార్‌తో ఒక సినిమా అనౌన్స్ చేశాడు. దిల్ రాజుతో చర్చల్లో ఉంది. కానీ ఇవి ఎప్పుడు మొదలవుతాయో ఎవ్వరికీ తెలియదు.

 

Tags :