ఆప్కో కొత్త రాజ్యాంగం ఆమోదం

ఆప్కో కొత్త రాజ్యాంగం ఆమోదం

ఆంధ్ర పీపుల్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఒహాయో (ఆప్కో)కు సంబంధించి కొత్త రాజ్యాంగాన్ని ధర్మకర్తల మండలి ఏకగ్రీవంగా ఆమోదించిందని ఆప్కో బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ చైర్‌ వేణుబాబు తలశిల తెలిపారు. తాము పడిన రెండేళ్ళ శ్రమకు ఫలితం దక్కిందని, ఈ మైలురాయిని గుర్తించడంలో  రాజ్యాంగ కమిటీ (గణేష్‌ వత్యం, మురళి పుట్టి,నాగేశ్వరరావు మన్నె) అద్భుతమైన కృషి చేసిందన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మరియు భావజాలం పునరావృతం కాకుండా ఉండటానికి సంవత్సరాలుగా నేర్చుకున్న పాఠాలను మన రాజ్యాంగంలో ఉంచారని, ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఆప్కో బోర్డ్‌ రాజ్యాంగాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు. సహచర బోర్డు సభ్యులు- సాయి రాచూరి, తేజో వట్టి, బాలాజీ కొడాలి, రవికుమారి దుర్వాసుల, సుశీల బొమ్మన మరియు శ్రీనివాస్‌ సంగ ఇచ్చిన మద్దతు మరవలేమని, గత రెండు సంవత్సరాలుగా వారి ఖాళీ సమయంలో లెక్కలేనన్ని గంటల జూమ్‌ సమావేశాలు నిర్వహించి చివరకు దీనిని ఆమోదించారన్నారు.

సలహాదారుల బోర్డు - రామారావు గూడే గారు, మోహన్‌ రాచూరి గారు మరియు భరత్‌ జటప్రోలు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, మాజీ అధ్యక్షుడు శ్రీధర్‌ వేగేశ్న అందించిన ఉత్సాహభరితమైన మద్దతు, ఆప్కో  ట్రస్టీగా ఉన్న సమయంలో తల్లపురెడ్డి ప్రశాంత్‌ రెడ్డి అందించిన సహాయానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆప్కోలో ఇప్పుడు జీవిత సభ్యత్వాన్ని కూడా ప్రవేశపెట్టాము మరియు జీవితకాల సభ్యులు మాత్రమే ఓటు వేయడానికి మరియు పోటీ చేయడానికి అర్హులు. సంస్థకు సంబంధించి రాజ్యాంగ లేకపోవడంపై వచ్చిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని కొత్త రాజ్యాంగాన్ని తాము ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ఆయన తెలిపారు.

 

Tags :