ఈ నెల 16న ఏపీ కేబినేట్ భేటీ

ఈ నెల 16న ఏపీ కేబినేట్ భేటీ

ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍మోహన్‍ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 16న సమావేశం కానుంది. సచివాలయంలో జరగనున్న రాష్ట్ర కేబినెట్‍ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అయితే ఈ నెల చివరి వారంలో ఆంధప్రదేశ్‍ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలు రెండు విడతల్లో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. తొలుత ఈ నెలలో ఐదు లేదా ఆరు రోజులు డిసెంబర్లో మరికొన్ని రోజులు నిర్వహించాలని చూస్తుంది. 16న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఏర్పాటు కానున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‍ విడుదల అయ్యే అవకాశముంది. కేబినెట్‍ భీటీలో అసెంబ్లీ సమావేశాలపై పూర్తి సృష్టత రానుంది.

 

Tags :