వారిని స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోండి : వైఎస్ జగన్

వారిని స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోండి : వైఎస్ జగన్

బహ్రెయిన్‌లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ కార్మికులను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లేఖ రాశారు. బ్రహెయిన్‌లో ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు అధికంగా ఉన్నారని లేఖలో వివరించారు. అక్కడ వారిని యాజమన్యం తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయన్నారు. వారిని త్వరగా భారత్‌కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి జైశంకర్‌ విజ్ఞప్తి చేశారు. బహ్రెయిన్‌ నుంచి కార్మికులను స్వదేశానికి తీసుకొచ్చే విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎంవో అధికారులు, ఆంధ్రప్రదేశ్‌ భవనం రెసిడెంట్‌ అధికారులు బహ్రెయిన్‌లో ఉన్న కార్మికులకు సంబంధించిన అన్ని వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

 

Tags :