ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు.. ఉద్యమాన్ని ఆపేది లేదు

ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు.. ఉద్యమాన్ని ఆపేది లేదు

న్యాయస్థానంలో మూడు రాజధానుల అంశంపై భంగపాటు తప్పదనే పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హఠాత్తుగా ప్రకటించిదని అమరావతి రైతులు ఆరోపించారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 706 రోజులుగా నిరసనలు చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్‌ స్పందించలేదన్నారు. ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని సీఎం, మంత్రులు చెబుతున్నారని గుర్తు చేశారు. లోపాలు సరి చేసి మరింత పకడ్బందీగా బిల్లును శాసనసభలో ప్రవేశ పెడతామంటున్న వైసీపీ నాయకలు వ్యాఖ్యలే దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు తమ ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు.

 

Tags :