వైఎస్‌ఆర్‌సీపీ సరికొత్త రికార్డు

వైఎస్‌ఆర్‌సీపీ సరికొత్త రికార్డు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికల ఫలితాల్లో వైఎస్‌ఆర్‌సీపీ సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని అన్ని జడ్పీ చైర్మన్ల స్థానాలను వైఎస్‌ఆర్‌సీపీ దక్కించుకుంది. 100 శాతం జడ్పీ చైర్మన్లను దక్కించుకున్న పార్టీగా రికార్డు సాధించింది. ఆదివారం విడుదలైన పరిషత్‌ ఎన్నికల ఫలితాల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయ ఢంకా మోగించింది. ఇప్పటివరకు 7,212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా,   వైఎస్‌ఆర్‌సీపీ 5998 స్థానాలతో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 826 స్థానాలకు పరిమితమైంది. 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాలు ప్రకటించగా.. వాటిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 502 స్థానాలు గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ 6 స్థానాలు, జనసేన పార్టీ 2 స్థానాలు, సీపీఎం 1, ఇతరులు 1 జడ్పీటీసీ స్థానాలలో విజయం సాధించారు.

 

Tags :