కురియన్ సేవలను ప్రశంసించిన అంజయ్యచౌదరి

కురియన్ సేవలను ప్రశంసించిన అంజయ్యచౌదరి

విజయవాడలో కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నవంబర్‌ 26వ తేదీన జరిగిన శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్‌ కురియన్‌ శత జయంతి ఉత్సవాల్లో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు పాల్గొన్నారు. స్థానిక చిట్టినగర్లోని విజయ డయిరీ ప్రాంగణంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో అంజయ్య చౌదరి ముఖ్య అతిధిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వలన గావించి కురియన్‌ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కురియన్‌ సేవలు స్ఫూర్తిదాయకమని, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో పాడి రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం తానా తరపున కృషి చేస్తామన్నారు. అనంతరం డయిరీ కొత్త ఉత్పత్తులను సభాముఖంగా ప్రారంభించారు. కృష్ణా మిల్క్‌ యూనియన్‌ తరపున ఛైర్మన్‌ ఆంజనేయులు చలసాని చేతులమీదుగా అంజయ్య చౌదరిని ‘స్ఫూర్తి ప్రదాతకు అక్షరసుమార్చన’ అంటూ ఘనంగా సత్కరించారు. తన ఇండియా పర్యటనలో ఇది మొట్టమొదటి కార్యక్రమం. మున్ముందు మరిన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నట్లు అంజయ్య చౌదరి పేర్కొన్నారు.

 

Tags :