"కోండలలో నెలకొన్న" కీర్తన ఆలపించి మలేషియన్ టౌన్ షిప్ వాసులలో ఆధ్యాత్మిక చింతన కలిగించిన శోభా రాజు 

"కోండలలో నెలకొన్న" కీర్తన ఆలపించి మలేషియన్ టౌన్ షిప్ వాసులలో ఆధ్యాత్మిక చింతన కలిగించిన శోభా రాజు 

కరోనా నిబంధనలతో పాటించి "గణరాజా గుణరాజా" అంటు అలరించింది పద్మశ్రీ అవార్డి డా. శోభారాజు గారి సంకీర్తనా విభావరి. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా మలేషియన్ టౌన్ షిప్ లోని  రెయిన్ ట్రీ పార్క్ ఫెస్టివల్ కమిటీ వారి ఆధ్వర్యంలో అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపకురాలు, "అన్నమయ్య పదకోకిల" పద్మశ్రీ  డా.శోభారాజు గారి అన్నమాచార్య సంకీర్తనా విభావరి నిర్వహించటం జరిగింది.

ఈ కార్యక్రమంలో శోభారాజుగారు అన్నమయ్య కీర్తనలను, గణనాథుని కీర్తనలను తీయ తేనియల తేటగా ఆలపించారు. స్వామి వారికి కైంకర్యం చేసిన సంకీర్తనలు; గణరాజా గుణరాజా,  వేడుకొందామా, చాలదా హరినామ, తందానానా, కోండలలో నెలకొన్న కోనేటి రాయుడు, రావమ్మా మహాలక్ష్మీ, ఎంత అందంగాడవురా మొదలగు సంకీర్తనలు ఆలపిస్తుంటే శ్రోతలు మైమరచి ఆనందసాగరంలో ఓలలాడారు.

ఈ కార్యక్రమానికి డా శోభా రాజు గారి శిష్యులు గాత్ర సహకారం అందించిన వారు కుమారి సాహితి అడపా, కుమారి అనన్య మంత్రవాది. వాయిద్య పై కీబోర్డ్ పై గురుప్రసాద్ గారు, తబలా పై జయకుమార్ ఆచార్య గారు. ఈ కార్యక్రమానికి వాయిద్య సహకరించారు. కార్యక్రమ చివరిగా నిర్వాహకులు శ్రీ నర్సింహులు గారు డాక్టర్ శోభారాజు గారి సంకీర్తనా గానం అమృత ధార లా సాగిందని కోనాయాడారు.

 Tags :