ఎమ్మెల్యేల ఎర కేసులో మరో మలుపు.. భారతిపై ఇంకో కేసు..

ఎమ్మెల్యేల ఎర కేసులో మరో మలుపు.. భారతిపై ఇంకో కేసు..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎర కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఈ కేసు ఎప్పటికప్పుడు ఊహకందని మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇందులో కీలక నిందితుడిగా ఉన్న రామచంద్రభారతిపై ఇంకో కేసు నమోదైంది. అతడకి రెండు పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని రాజేంద్రనగర్ ఏసీపీ, సిట్ సభ్యుడు ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అయితే భారత ల్యాప్‌టాప్ పరిశీలనలో ఈ విషయం వెలుగు చూసిందని, ఆ సమయంలోనే అతడి రెండు పాస్‌పోర్ట్‌లను చూశామని అధికారులు తెలిపారు. ఈ రెండు వేరు వేరు నెంబర్లతో ఉన్నాయని ఏసీపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైనెస్స్‌లు సైతం ఒక్కొక్కటికి మూడు చొప్పున ఉన్నాయని భారతిపై ఎమ్మెల్యే పైటర్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు భారతిపై ఒక కేసు ఉంది. అయితే తమను అధికారులు దర్యాప్తు పేరుతో వేధిస్తున్నారంటూ న్యాయవాది శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు పిలిచినప్పుడల్లా రావాలని సిట్ అధికారులు పేర్కొన్నారని, దీంతో ఇతర పనులను ఏమీ కూడా చేసుకునేందుకు వీలు పడటం లేదని శ్రీనివాస్ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. అయితే న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ నెల 25న సిట్ ఎదుట హాజరై అధికారులు ఇదివరకు అడిగిన పూర్తి సమాచారాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

 

Tags :
ii). Please add in the header part of the home page.