చంద్రముఖి సీక్వెల్ లో అనుష్క శెట్టి, రాఘవ లారెన్స్?

చంద్రముఖి సీక్వెల్ లో అనుష్క శెట్టి, రాఘవ లారెన్స్?

సౌత్‌లో స్టార్‌ హీరోలకు సమానంగా క్రేజ్‌ సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి. లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో పాపులారిటీ దక్కించుకున్న అనుష్క నిశ్శబ్దం మూవీ తర్వాత మరే చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. తాజాగా మరో సూపర్‌హిట్‌ చిత్రంతో అలరించేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌కు రెడీ అవుతున్నట్లు సమాచారం. డైరెక్టర్‌ పి. వాసు దర్శకత్వంలో  లారెన్స్‌-అనుష్క కాంబినేషన్‌లో సినిమా రూపొందనుందనే టాక్‌ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ కోసం అనుష్కని సంప్రదించారని, ఆమె కూడా ఈ చిత్రం చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఫిల్మ్‌ నగర్‌ వర్గాల్లో జోరుగా  చర్చ నడుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానుంది. 

 

Tags :