వచ్చే ఎన్నికల్లో జనసేనతోనే కలిసి.. బీజేపీ

వచ్చే ఎన్నికల్లో జనసేనతోనే కలిసి.. బీజేపీ

వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో బీజేపీ అధికారంకి వచ్చేలా బ్లూ ప్రింట్‌ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎన్నో అంశాలపై సమీక్ష చేసే జగన్‌ అప్పులపై ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. వచ్చే నెల 5, 6 తేదీల్లో రాజమహేంద్రవరం, విజయవాడలో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో తమ పొత్తులపై వైసీపీ నేతలే ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. పాలన బాగుందనుకుంటే ముందస్తు ఎన్నికలకు వైసీపీ సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు.  ఈ సభల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొంటారని తెలిపారు.

 

Tags :