ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అదనపు డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్ర్రదేశ్ సీఐడీ చీఫ్గా ఉన్న పి.వి.సునీల్కుమార్ని ప్రభుత్వం బదిలీ చేసింది. సునీల్ కుమార్ని సాధారణ పరిపాలనా శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని అదేశించింది. సీఐడీ అదనపు డీజీగా నియమితులైన ఎన్. సంజయ్ ప్రస్తుతం విపత్తు నిర్వహణ డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతర్గత బదిలీల్లో భాగంగానే ఈ బదిలీ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Tags :