ఎంపీ రఘురామకు ఏపీ సీఐడీ నోటీసులు

ఎంపీ రఘురామకు ఏపీ సీఐడీ నోటీసులు

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీసులు చేరుకున్నారు. నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఎంపీ నివాసానికి వచ్చారు. 17న విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. తొలుత ఆ నోటీసులు తనకు అందించాలని రఘురామ కుమారుడు పోలీసులను కోరగా వారు నిరాకరించారు. నేరుగా రఘురామకే అందజేస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఆయనకే అందజేసి వెళ్లారు. అయితే రఘురామకు అందించిన నోటీసులు ఏ కేసుకు సంబంధించినవి అనేది తెలియాల్సి ఉంది.  కాగా రఘురామను అరెస్టు చేయొద్దని గతంలో సుప్రీం కోర్టు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనను అరెస్టు చేసే అవకాశం లేదు. గతంలో ఉన్న కేసులకు సంబంధించి రఘురామ విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

 

Tags :