వాటిపైనా పన్ను విధించిన ఘనత.. ఈ ముఖ్యమంత్రికే : చంద్రబాబు

వాటిపైనా పన్ను విధించిన ఘనత.. ఈ ముఖ్యమంత్రికే : చంద్రబాబు

మహిళా శక్తి అంటే ఏంటో మళ్లీ ప్రపంచానికి చాటి చెప్పాల్సిన సమయం వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా డ్వాక్రా, అంగన్వాడీ, పొదుపు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని రాష్ట్రంలోని మహిళలను ఎవరు పైకి తీసుకొచ్చారో ఎవరూ మోసం చేస్తున్నారో బేరీజు వేసుకోవాలని మహిళలకు సూచించారు. డ్వాక్రా సంఘాల స్వయం సాధికారత స్ఫూర్తిని సీఎం జగన్‌  దెబ్బతీశారు.  మహిళలు తమ ఇంటి ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకోవాలి. గత 4 ఏళ్లలో మీ ఖర్చులు పెరిగిపోయా లేదా? అనేది చూసుకోవాలి.  మీ కొనుగోలు శక్తి తగ్గిందో లేదో  ఆలోచన చేయాలి. కేవలం తన సభలకు హాజరు కావడం కోసమే డ్వాక్రా సంఘాలను సీఎం జగన్‌ వినియోగించుకుంటున్నారు. మహిళల ఆత్మగౌరవానికి టీడీపీ మరుగుదొడ్ల కటిస్తే, వాటిపైనా పన్ను విధించిన ఘనత ఈ ముఖ్యమంత్రికే దక్కుంది. టీడీపీ అధికారంలోకి రాగానే మళ్లీ డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తాం. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చేందకు కృషి చేస్తాం  అని చంద్రబాబు  తెలిపారు.

 

Tags :