జాతీయ స్థాయిలో ఏపీ అరుదైన రికార్డు

జాతీయ స్థాయిలో ఏపీ అరుదైన రికార్డు

జాతీయ స్థాయిలో ఘనతను చాటిని ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభినందించారు. ప్రజలకు ఉత్తమమైన సేవలఱు అందించినందుకు రాష్ట్ర పోలీసుశాఖను ముఖ్యమంత్రి అభినందించారు. ఇదేరీతిలో ప్రజలకు మరిన్ని సేవలను నిర్ణీత సమయంలో అందించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, పోలీసు ఉన్నతాధికారులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. స్మార్ట్‌ పోలీసింగ్‌ సర్వే వివరాలను ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఇండియన్‌ పోలీస్‌ ఫౌండేషన్‌ స్మార్ట్‌ పోలీసింగ్‌ సర్వేలో  ఏపీ పోలీసింగ్‌ నెంబర్‌వన్‌ ర్యాంక్‌ సాధించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించిన ఈ ఫౌండేషన్‌ తొమ్మిది ప్రామాణిక అంశాల్లో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాలలో సర్వే చేపట్టిందని డీజీపీ తెలిపారు.

ఆయా రాష్ట్రాలలో పోలీస్‌ ఫౌండేషన్‌ ఏడేళ్లుగా సర్వే నిర్వస్తుందన్నారు. ఈ ఏడాది ఏపీ తొలిసారిగా మొదటి ర్యాంకు సాధించిందని తెలిపారు. ఏపీ పోలీస్‌ శాఖ ప్రజల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఐపిఎఫ్‌ఐపిఎఫ్‌ అధ్యయనం చేస్తుందని అన్నారు. దీనిలో రిటైర్డు డీజీలు, ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు, ఐఐటీ ప్రొఫెసర్లు, పౌరసమాజ ప్రముఖులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు.

 

Tags :