13న ఏపీ మంత్రివర్గ సమావేశం

13న ఏపీ మంత్రివర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 13వ తేదీన జరగనుంది. మంత్రివర్గ విస్తరణ జరిగిన తరువాత తొలిసారి జరగనున్న సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడిరది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి భవనంలో సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ సర్కులర్‌ జారీ చేశారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్న అంశాలపై  ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్ని శాఖల ప్రత్యేక, ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. 11వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు ఈ  ప్రతిపాదనలు తయారు చేయాలని పేర్కొన్నారు. ఆర్థిక స్థితితో పాటు రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పలు పరిణామాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఇటీవల కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన వియం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మంత్రులను వివరణ కోరే అవకాశమూ ఉందని చెబుతున్నారు.

 

Tags :