తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్

తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారిని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దర్శించుకున్నారు. సాంప్రదాయ పంచకట్టుతో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుపతి, తిరుమలలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ముందుగా తిరుపతి బర్డ్‌ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం అలిపిరి వద్ద చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శ్రీవారి పాదాల నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి తిరుమల చేసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, మంత్రులు స్వాగతం పలికారు.

 

Tags :