సంక్రాంతి సంబరాల్లో సీఎం వైఎస్ జగన్

సంక్రాంతి సంబరాల్లో సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. సీఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గోవులకు ప్రత్యేక పూజలు, భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలతో వైభవంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన అక్కచెల్లెల్లక కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులు, అవ్వాతాతలు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Tags :