బీజేపీ చేసే ప్రతి చర్యకూ రియాక్షన్

దేశంలో బీజేపీ చేసే ప్రతీ చర్యకూ రియాక్షన్ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలజానాథ్ అన్నారు. ఈ సందర్భాంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల వికృత రాజకీయ క్రీడను దేశమంతా వ్యతిరేకిస్తోందని అన్నారు. ఎఫ్ఐఆర్ కూడా లేని కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మూడు రోజులు విచారించారని మండిపడ్డాడరు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ పర్యటిస్తారని తెలిపారు. ఆశేతు హిమాచలం రాహుల్ పర్యటిస్తే బీజేపీ పక్కటెముకలు విరుగుతాయని వ్యాఖ్యానించారు. తక్షణమే రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో సమస్యలను డైవర్షన్ చేయడానికే రాహుల్ గాంధీని విచారించారని ఆరోపించారు.
Tags :