సీఎం వైఎస్ జగన్ ను కలిసిన సీఎస్ జవహర్‌రెడ్డి

సీఎం వైఎస్ జగన్ ను కలిసిన సీఎస్ జవహర్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. సీఎస్‌ గా తనకు అవకాశం కల్పించినందుకు జగన్‌కి జవహర్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సమీర్‌ శర్మ పదవీ విరమణ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా జవహర్‌ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ  చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 1990 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్‌ అధికారి జవహర్‌రెడ్డి సీఎంకు ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు.

 

Tags :