ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. వారికి గుడ్ న్యూస్

ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. వారికి గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అర్హులైన అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ హెల్పర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు, సంబంధిత శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆదాయ పరిమితిలోపు గౌరవ వేతనం పొందుతున్న అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ హెల్పర్లకు వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుకతో పాటు అమ్మ ఒడి, ఇళ్ల స్థలాల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలకు సాయంతో పాటు వివిధ సంక్షేమ పథకాలను వర్తింపజేయాల్సిందిగా గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల శాఖతో పాటు గ్రామీణ పేదిరిక నిర్మాలన సొసైటీ, పంచాయతీరాజ్‌, పట్టణాభివృద్ధి శాఖలు, జిల్లా కలెక్టర్లకు మహిళా శిశు సంక్షేమ శాఖ అదేశాలిచ్చింది. ఈ మేరకు సంబంధిత శాఖలకు మహిళ శిశు సంక్షేమ శాఖ సర్క్యులర్‌ ఇచ్చింది.

 

Tags :