వారి కోసం ప్రపంచ బ్యాంకుతో... ఏపీ ప్రభుత్వం ఒప్పందం

వారి కోసం ప్రపంచ బ్యాంకుతో... ఏపీ ప్రభుత్వం ఒప్పందం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో రుణ ఒప్పందం చేసుకుంది. ప్రపంచ బ్యాంకుతో రూ.1,860 కోట్లకు రుణ ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థుల నైపుణ్యాల మెరుగుకు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. డిసెంబర్‌ 18న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఒప్పంద పత్రాలపై ఏపీ అధికారులు సంతకాలు చేయనున్నారు. ఈ  ఒప్పందంతో ఏపీలోని 50 లక్షలకు పైగా విద్యార్థులు, ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

 

Tags :