ఏపీ సచివాలయ ఉద్యోగులకు.. ప్రభుత్వం షాక్

ఏపీ సచివాలయ ఉద్యోగులకు.. ప్రభుత్వం షాక్

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఉచిత వసతి సదుపాయాన్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలివచ్చిన ఉద్యోగులకు వివిధ ప్రాంతాల్లో నాటి ప్రభుత్వం ఉచిత వసతి కల్పించింది. రేపటిలోగా భవనాలు ఖాళీ చేయాలని వైసీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భవనాలను ఎలాంటి రిపేర్లు లేకుండా తిరిగి అప్పగించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఏం చేయాలో అర్థం కాక సచివాలయ ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు.  తీవ్ర ఆవేదనకు ఉద్యోగులు గురవుతున్నారు. 2017లో సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఉచిత వసతి కల్పించింది.

 

Tags :