ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం: 30 నుంచి 40 లక్షల మందికి ఉపాధి

ఏపీలో నిరుద్యోగ యువతకు వైయస్సార్ సీపీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. మరో 2 నెలల్లో 15 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రత్యేక పార్క్‌లను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఒక్కో నియోజకవర్గానికి ఓ పార్కు చొప్పున రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ పార్క్‌లను ఏర్పాటు చేయబోతన్నట్లు ప్రకటించింది. ఈ పార్క్ ల ద్వారా రాష్ట్రంలోని దాదాపు 30 నుంచి 40 లక్షలమంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తోంది.
2 నెలల్లో 15 లక్షల మందికి ఉపాధి:
మొదటి దశలో 75 పార్క్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో ఇప్పటికే 25 పార్క్‌ల ఏర్పాటు పూర్తయిందని, వీటిల్లోకి దాదాపు 25 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని పరిశ్రమల శాఖ తెలిపింది. మార్చి నాటికి మరో 50 పార్క్‌లు పూర్తవుతాయని, వీటన్నింటి ద్వారా 15 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సదరు అధికారులు అంచనా వేస్తున్నారు.
విదేశీ పర్యటనకు ప్రత్యేక బృందం:
ఎంఎస్ఎంయీ పార్క్ ల ఏర్పాటులో భాగంగా అభివృద్ది చెందిన దేశాల్లో ఎంఎస్ఎంఈ పార్క్‌లను అధ్యయనం చేసేందుకు త్వరలోనే పరిశ్రమల శాఖకు చెందిన నిపుణుల బృందాన్ని విదేశీ పర్యటనకు పంపించనుంది.
భూముల కేటాయింపు:
ఒక్కో పార్క్‌కు 100 నుండి 200 వందల ఎకరాల స్థలాలను కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించి స్థలాలను ఎంపిక చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటికే 25 పార్క్‌ల ఏర్పాటు పూర్తికాగా.. మార్చి నాటికి మరో 50 కూడా ఆ తర్వాత మిగిలిన 100 పార్క్‌లకు సంబంధించి మార్చిలోగా భూమిని ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఆ పార్క్‌ల్లో పరిశ్రమలు పెట్టే వారికి భూమి రేటు, విద్యుత్‌తోపాటు అనేక రకాల సబ్సిడీలు కూడా ఇవ్వనున్నట్లు జగన్ సర్కార్ ప్రకటించింది.
క్లస్టర్ పద్దతిలో ఏర్పాటు:
ప్రతి పార్క్ లో ఒకటే రకమైన ఉత్పత్తి మాత్రమే చేసేలా డిజైన్ చేయనున్నారు. దీనివల్ల క్టస్టర్ బేస్డ్ పార్క్‌లు ఏర్పడతాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను కూడా సులభంగా తీసుకురావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు 175 పార్క్‌లు సాకారమైతే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య దాదాపు తీరిపోవడమే కాక రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రమే మారిపోతుంది.