MKOne Telugu Times Youtube Channel

ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. రెండో అధికార భాషగా

ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. రెండో అధికార భాషగా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషల చట్ట సవరణ-2022కు సంబంధించి మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి,  యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా చట్టబద్ధత కల్పించింది. మైనార్టీలు, ఉర్దూ ప్రేమికుల ఆవేదనను గుర్తించిన సీఎం జగన్‌ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉర్దూకు స్థానం కల్పించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికార కార్యకలాపాలు, ఉత్తర, ప్రత్యుత్తరాలను తెలుగుతో పాటు ఉర్దూలోనూ సాగించేలా సమాన హోదా కల్పించినట్టైంది.

 

Tags :