ఏపీ ప్రభుత్వం శుభవార్త.. 14 వేల పోస్టులకు!

ఏపీ ప్రభుత్వం శుభవార్త.. 14 వేల పోస్టులకు!

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పబోతోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో 14 వేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ కసరత్తు తుది దశకు చేరింది. మరి కొద్ది రోజుల్లోనే  ఈ నోటీఫికేషన్‌ జారీ కానుంది. ఇప్పటికే 1.34 లక్షల మంది సచివాలయ ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది. గత రెండు విడతల మాదిరే ఈసారి కూడా ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించింది. ఇదే సమయంలో నియామక ప్రక్రియలో కొన్ని కీలక మార్పుల దిశగా నిర్ణయం తీసుకుంది. మొత్తం 19 కేటగిరీ పోస్టులను భర్తీ చేయాలని ప్రాధమికంగా నిర్ణయించారు. 

 

 

Tags :