ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జనవరి 7, 2020 న కౌన్సిల్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేశామని, ఇన్నాళ్లు ఒక సందిగ్ధత నెలకొందని అన్నారు. శాసన మండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సభకు వివరించారు. మండలి రద్దు ఉపసంహరణ తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది.

ఈ సందర్భగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ రాజ్యాంగంలోని 168 అధికరణ కింద 1958లో శాసన మండలిని ఏర్పాటు చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో శాసనమండలి రద్దు చేశారన్నారు. తిరిగి 2006లో మండలిని వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పునరుద్ధరించారని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధుల నుంచి ఎన్నుకోబడిన మండలి సుప్రీం అయినప్పటికీ దిగువ సభకు సూచనలు చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి కౌన్సిల్‌ అసవరం లేదని 2020 జనవరి 7న తీర్మానించామన్నారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి కూడా పంపించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. దీంతో దీనిపై సభ్యుల్లో సందిగ్ధత ఏర్పడిరదన్నారు. అన్ని వర్గాల నుంచి సభ్యులు వచ్చిన దృష్ట్యా సందిగ్ధతకు తెరదించుతూ శాసన మండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కౌన్సిల్‌ రద్దు నిర్ణయాన్ని విరమించుకుంటూ తీర్మానం చేస్తున్నామని తెలిపారు.

 

Tags :