ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖలోని రాజీవ్ స్వగృహకు ఇచ్చిన భూమి వేలంపై హైకోర్టు స్టే విధించింది. రాజీవ్ స్వగృహాకు ఇచ్చిన భూమిలో ఏపీ ప్రభుత్వం ఇళ్లు నిర్మించలేదు. రాజీవ్ స్వగృహ భూముల వేలానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 25 ఎకరాలు అమ్మాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టును ఆశయించారు. రామకృష్ణబాబు తరుపున న్యాయవాది అశ్వినీకుమార్ వాదనలు వినిపించారు. మధ్యతరగతి వారి ఇళ్ల కోసం ఇచ్చిన స్థలాన్ని వేలం వేయడమేంటని లాయర్ అశ్వినీకుమార్ ప్రశ్నించారు. పిటిషనర్ వాదనతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. ప్లాట్లు వేలం వేయడానికి వీలే లేదని హైకోర్టు స్టే విధించింది.
Tags :