నిబంధనల మేరకే ఉత్సవాలు : హైకోర్టు

నిబంధనల మేరకే ఉత్సవాలు : హైకోర్టు

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వినాయక చవితి ఉత్సవాలపై దాఖలైన లంచ్‍ మోషన్‍ పిటిషన్‍పై హైకోర్టు విచారణ జరిపింది. నిబంధనలు పాటిస్తూ వినాయక పూజలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేటు స్థలాల్లో గణేష్‍ ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని ఆర్టికల్‍ 26తో ప్రజలకు మతపరమైన కార్యక్రమాలు నిర్వహణకు ప్రజలకు అధికారం ఉంటుందని, నిరోధించే హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్‍ నిబంధనల మేరకు పూజలు చేసుకోవచ్చని ప్రజలకు సూచించారు. ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు జరుపుకోవాలని వెల్లడించింది. మరోవైపు పబ్లిక్‍ స్థలాల్లో ఉత్సవాతు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించింది. ప్రైవేటు స్థలాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది.

 

Tags :