అమరావతి రైతులకు హైకోర్టు ఊరట

అమరావతి రైతులకు హైకోర్టు ఊరట

అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. రైతులకు ఇచ్చిన రిటర్న్‌ గిప్ట్‌ ప్లాట్లను స్వాధీనం చేసుకుంటామని ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేసింది. న్యాయవాది ఇంద్రనీల్‌ బాబు జీవో నెంబర్‌ 316ను హైకోర్టులో సవాలు చేశారు. నోటీసులు ఇవ్వకుండా కేటాయించిన ప్లాట్‌లను రద్దు చేసేందుకు జీవో ఇచ్చారని ఇంద్రనీల్‌ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రైతులకు రిటర్న్‌ గిప్ట్‌గా ఇచ్చిన ప్లాట్లను స్వాధీనం చేసుకోవడం చట్ట విరుద్ధమని రైతుల తరపున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారమే ప్లాట్లను ఇచ్చినట్లు  ఆ నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేయాలని ధర్మాసనానికి తెలిపారు. దీంతో ఆ జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. జీవోకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఏఎంఆర్డీఏను ఆదేశించింది.

 

Tags :