ఏపీ హైకోర్టు జడ్జిలుగా ఏడుగురి నియామకం

ఏపీ హైకోర్టు జడ్జిలుగా ఏడుగురి నియామకం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు ఏడుగురు న్యాయవాదుల పేర్లను సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన తీర్మానానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, డాక్టర్‌ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌, బండారు శ్యాం సుందర్‌, ఊటుకూరు శ్రీనివాస్‌, బొప్పన వరాహ లక్ష్మీ నర్సింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణలను న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడుగురి నియమకాన్ని నోటిఫై చేస్తు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

వీరిలో అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, డాక్టర్‌ వక్కలగడ్డ రాధాకృష్ణ, కృపాసాగర్‌, బండారు శ్యాం సుందర్‌, ఊటుకూరు శ్రీనివాస్‌ న్యాయమూర్తులుగా కాగా, బొప్పన వరాహ లక్ష్మీ నర్సింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణలు అదనపు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు.

 

Tags :