రెండు నెలల్లో పరిపాలన రాజధానిగా విశాఖ : మంత్రి గుడివాడ

మరో రెండు నెలల్లో విశాఖ ఆంధ్రప్రదేశ్‌కు పరిపాలన రాజధాని కాబోతోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో ఇన్ఫినిటీ వైజాగ్ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖ ప్రాంతాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. త్వరలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని వెల్లడిరచారు. దేశంలోని ధనిక నగరాల్లో విశాఖ తొమ్మిదవ స్థానంలో ఉందన్నారు. త్వరలో అదాని డేటా సెంటర్‌ను ప్రారంభిస్తామన్నారు. విశాఖను ఐటీ హబ్ చేయడమే మా లక్ష్యం అని ప్రకటించారు.
Tags :