టీడీపీ, జనసేన కలిసి పోటీచేసినా.. గెలుపు మాత్రం మాదే

రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేసినా గెలుపు మాత్రం మాదే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తెలిపారు. బుట్టాయగూడెంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్ బాబు ఎన్ని పాదయాత్రలు చేసినా ఒరిగేదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి అన్నారు. రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తణకు నుంచి పోటీ చేస్తే పవన్‌పై పోటీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. లోకేశ్ పాదయాత్రను ప్రజలు జోకర్లా చూస్తున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సీఎం జగన్‌పై నమ్మకంతో ఉన్నారు అని అన్నారు.
Tags :