చంద్రబాబును హత్య చేయాల్సిన పని మాకు లేదు

చంద్రబాబును హత్య చేయాల్సిన పని మాకు లేదు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును హత్య చేయాల్సిన పని మాకు లేదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు.   తిరుపతి జిల్లా క్రీడా సంబరాలు ప్రారంభం కార్యక్రమం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మరొక్కసారి అవకాశం ఇవ్వాలని అడగడం ఇదేం కర్మ రా బాబు అని  ప్రజలు అనుకుంటున్నారు అన్నారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని అన్నారు.  రాయలసీమ వాసిగా  చంద్రబాబును చూసి తలదించుకుంటున్నారన్నారు. న్యాయ రాజధాని కర్నూలుకు వస్తుంటే అడ్డుకునేలా  చూస్తున్నారని పేర్కొన్నారు. సామాజిక వర్గాల వారీగా మోసం చేసిన చంద్రబాబు వారిని ఓట్లు అడుగుతుంటే ఇదేం కర్మరా బాబు అని అనుకుంటున్నారని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ఇంకా రాజకీయాలు మాని మనవాడితో ఆడుకుంటే మేలు అన్నారు. చంద్రబాబుకు ఏ సింపతి బాబుకు ఏ వర్గం సింపతి సూపడం లేదన్నారు.

 

 

Tags :