దావోస్‌లో ఏపీ పెవిలియన్ ఏర్పాటు

దావోస్‌లో ఏపీ పెవిలియన్ ఏర్పాటు

ఈనెల 22 నుంచి 26 వరకు దావోస్‌లో జరగనున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంలో పాల్గొనేందుకు సీఎం జగన్‌తో పాటు మంత్రులు, అధికారుల బృందం బయలుదేరనుంది. నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా చేపట్టాల్సిన చర్యలపై దావోస్‌ వేదికగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక చర్చలు జరుపుతారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాలు, పరిశ్రమల ఏర్పాటుకున్న అనువైన వాతావరణం వంటి అంశాలను వివరించేలా దావోస్‌లో ఏపీ పెవిలియన్‌ను ఏర్పాటు చేశాం. ప్రజలు, పురోగతి, అవకాశాలు పీపుల్స్‌, అవకాశాలు  (పీపుల్స్‌, ప్రోగ్రెస్‌, పాజిబిలిటీ) నినాదంతో పెవిలియన్‌ను నిర్వహిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా హాజరయ్యే ప్రతినిధులతో కూడిన దావోస్‌ కాంగ్రెస్‌ పలు కీలకాంశాలపై  దృష్టి పెట్టనుంది.

ఆహారం, వాతావరణ మార్పులు, సాంకేతిక రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు, సుపరిపాలన, సైబర్‌ సెక్యూరిటీ, అంతర్జాతీయ సహకారం, పునర్నిర్మాణం, ఆర్థిక వ్యవస్థలో సమతుల్యత, అందరికీ ఆరోగ్యంపై జరిగే చర్చలో ఏపీ భాగస్వామ్యం ఉంటుంది. కొవిడ్‌ పరిస్థితులు ఎదుర్కొని వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించేలా సన్నద్ధమయ్యాం అని ప్రభుత్వం పేర్కొంది.

 

Tags :