చరిత్రలో ఎన్నడూ జరగని ప్రక్రియని.. ఇప్పుడు

చరిత్రలో ఎన్నడూ జరగని ప్రక్రియని.. ఇప్పుడు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తరగతుల విలీనంపై కొన్ని పేపర్లు తప్పుడు వార్తలు రాస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తరగతుల విలీనంపై తప్పుడు వార్తలు రాస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ జరగని ప్రక్రియని ఇప్పుడు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి అమలు చేస్తున్నామన్నారు. పత్రికల్లో కథనాలు రాసేవాళ్ళు, సమస్య ఏంటో చేప్తే పరిష్కరిస్తామన్నారు. సంఘాలు, టీచర్లు కొన్ని పాలసీలను వ్యతిరేకిస్తున్నారు. కానీ మేం మాత్రం ప్రతీ నిర్ణయం విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తీసుకుంటున్నామన్నారు. పిల్లలకు మంచి చేసే నిర్ణయాలనే మేము తీసుకుంటున్నాం.  గతంలో నిర్ణయాలు విద్యార్థుల కోసం కాకుండా ఇతర కారణాలతో తీసుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు మేం మాత్రం విద్యార్థుల కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం అని స్పష్టం చేశారు.

 

Tags :