హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు.. టాప్ 20లో

హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు.. టాప్ 20లో

హైదరాబాద్‌ మరో ఖ్యాతిని దక్కించుకుంది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని టాప్‌ 20 స్థిరమైన నగరాల్లో ఒకటిగా నిలించింది. దీంతో పాటు భారత దేశ నగరాల్లో బెంగళూరు, ఢిల్లీ, తరువాత స్థిరమైన, వాణిజ్య, రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల్లో మూడోస్థానాన్ని దక్కించుకుంది.  ప్రాపర్టీ కన్సల్టెంట్‌ నైట్‌ ఫ్రాంక్‌ తన తాజా నివేదికలో ఈ విషయాన్నిపేర్కొంది. యాక్టివ్‌ క్యాపిటల్‌ ఏసియా పసిఫిక్‌  రైజింగ్‌ క్యాపిటల్‌ ఇన్‌ అన్‌సర్టెన్‌ టైమ్స్‌ పేరుతో నైట్‌ఫ్రాంక్‌ ఒక జాతితాను విడుదల చేసింది. పట్టణీకరణ ఒత్తిడి, వాతావరణ ప్రమాదం, కర్బన ఉద్గారాలు, ప్రభుత్వ కార్యక్రమాల ఆధారంగా 36 నగరాలకు రేటింగ్‌ ఇచ్చింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో సింగపూర్‌, సిడ్నీ, వెల్లింగ్టన్‌, పెర్త్‌, మెల్‌బోర్న్‌ నగరాలు వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌లో మొదటి ఐదు గ్రీన్‌రేటెడ్‌ జాబితాలో ఉన్నాయి.

 

Tags :