మిస్ గార్జియస్ ఆఫ్ తెలంగాణగా అపర్ణ

మిస్ గార్జియస్-2023 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పేరుతో టోగుల్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన అందాల పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో మిస్ తెలంగాణ టైటిల్‌ను అపర్ణ గెలుచుకోవగా, సెకండ్ రన్నరప్‌గా సురేఖా బాన్సోడ్, ఫస్ట్ రన్నరప్‌గా ఆర్తి ప్రొద్దుకు దక్కించుకున్నారు. ఈ సంసద్భంగా టోగుల్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ అధినేత రఘు బొద్దు మాట్లాడుతూ 2015 నుంచి ప్రతి సంవత్సరం తమ సంస్థ ఆధ్వర్యంలో అందాల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫ్యాషన్ ఇండస్ట్రీ, సినిమా రంగం పట్ల ఆసక్తి ఉన్న యువతకు శిక్షణ ఇచ్చి ఎలాంటి రుసుము వసూలు చేయకుండా వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ ఫ్యాషన్ కొరియో గ్రాఫర్ అరుణ్ రత్నాతో ర్యాంప్ వాక్‌పై ట్రైనింగ్ ఇప్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ హీరో దత్తు, జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి, ప్రవీణ్, చిరంజిత్ తదితరులు పాల్గొన్నారు.