సమస్యలు పరిష్కారం కాకుంటే.. ఆందోళనకు దిగుతాం

సమస్యలు పరిష్కారం కాకుంటే.. ఆందోళనకు దిగుతాం

సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి విన్నవించారు. ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు అందించడం, సీపీఎస్‌ రద్దు, పీఆర్‌సీ ప్రకటించడం సహా వివిద అంశాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఏపీజేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ సమ్యలపై రెండు రోజుల్లో ఉన్నతాధికారులతో భేటీ ఏర్పాటు చేస్తామని సజ్జల హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, కరోనా మృతుల కుటుంబాలకు సాయం చేయాలని కోరినట్లు తెలిపారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బు, బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. దసర కానుకగా పీఆర్‌సీ ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కారం కాకుంటే ఆందోళన దిగడం తప్ప మరో మార్గం లేదన్నారు.

ఉద్యోగులకు కింద స్థాయిలో చాలా బర్నింగ్‌ సమస్యలున్నాయి. 12వ తేదీ వచ్చినా రిటైర్డ్‌ ఉద్యోగులకు పెన్షన్లు రావడం లేదు. ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకూ డబ్బులు రావడం లేదు. ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరాం. ప్రభుత్వానికి ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం ఇంకా ఇవ్వలేమని తెలిపారు. మాపై ఉద్యోగుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయి. సమస్యలు వెంటనే పరిష్కరించాలని అన్నారు.

 

Tags :