నాడు-నేడులో ప్రవాసాంద్రులు భాగస్వామ్యం కండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాడు-నేడు కార్యాక్రమంలో ప్రవాసాంధ్రులు భాగస్వామ్యం కావాల్సిందిగా ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) కోరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలతో ఏపీఎన్ఆర్టీఎస్ వర్చువల్ సమావేశం నిర్వహించింది. ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ ఎస్ మేడపాటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన నాడు నేడు రెండో దశ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ గొప్ప సంక్పలంలో భాగస్వాములు కావడం ద్వారా రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిందిగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవాసాంధ్రులకు కల్పిస్తున్న వివిధ సేవలను వివరించారు. ఏపీఎన్ఆర్టీఎస్ చేపడుతున్న వివిధ కార్యక్రమాలను తమ దేశాల్లో మరింత ప్రచారం చేస్తామని పలు తెలుగు సంఘాలు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై సలహాదారు ఎం జ్ఞానేంద్ర రెడ్డి, రాష్ట్ర విదేశీ వ్యవహారాల ప్రత్యేక అధికారి ఎ.గితేష్వర్మ, ఐఎఫ్ఎస్(రిటైర్డ్), ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏపీఎన్ఆర్టీఎస్ సీఈవో దినేష్‌కుమార్ పాల్గొన్నారు.