సీఎం సహాయ నిధికి అపోలో రూ.2 కోట్ల విరాళం

సీఎం సహాయ నిధికి అపోలో రూ.2 కోట్ల విరాళం

ఆంధప్రదేశ్‍ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి అపోలో హాస్పిటల్స్ గ్రూప్‍ రూ.కోటిని విరాళం ప్రకటించింది. కార్పోరేట్‍ సోషల్‍ రెస్పాన్స్ బులిటీ కింద కనెక్ట్ టు ఆంధ్రాకు మరో రూ.కోటిని ప్రకటించింది. రూ.రెండు కోట్ల మొత్తానికి సంబంధించిన చెక్కులను సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‍కు అపోలో గ్రూప్స్ ప్రతినిధులు అందించారు. అపోలో హాస్పిటల్‍ గ్రూప ఎగ్జిక్యూటివ్‍ వైఎస్‍ చైర్మన్‍ ప్రీతారెడ్డి, ప్రోక్యూర్‍మెంట్‍, కార్పోరేట్‍ డెవలప్‍మెంట్‍ ప్రెసిడెంట్‍ సర్వోత్తమ్‍ రెడ్డి, సీఈవోలు కె.ప్రభాకర్‍, శివరామకృష్ణన్‍లు ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ను కలిసిన వారిలో ఉన్నారు.

 

Tags :