ఇదే మొదటిసారి... యూనియన్ లో చేరిన ఆపిల్

అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రంలో ఆపిల్ ఇన్‌కార్పొరేటెడ్‌కు చెందిన కార్మికులు యూనియన్‌లో చేరారు. అమెరికాలో దిగ్గజ టెక్ సంస్థగా పేరున్న ఆపిల్‌కు చెందిన రిటైల్ ఉద్యోగులు ఒక యూనియన్‌లో చేరడం ఇదే మొదటిసారి. బాల్టీమోర్ పట్టణానికి చెందిన రిటైల్ ఉద్యోగులు ఒక యూనియన్‌లో చేరడం ఇదే మొదటిసారి. బాల్టీమోర్ పట్టణానికి సమీపంలో ఉన్న టౌన్సన్లోని ఆపిల్ సంస్థలో 100 మందికి పైగా కార్మికులు ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మెనినిస్ట్స్ అండ్ ఏరోస్పేస్ వర్కర్స్ అనే యూనియన్‌లో చేరారు. కాగా విషయాన్ని యూనియన్ తన వెబ్సైట్లో ప్రకటించింది. కాగా మరోవైపు అమెరికాలో అమెజాన్, స్టార్బుక్స్ వంటి ప్రముఖ కార్పొరేట్ సంస్థల్లోను యూనియన్ ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి.
Tags :