డ్రాగన్ ఆధిపత్యానికి ఆపిల్ చెక్ .. భారత్ లోనూ

డ్రాగన్ ఆధిపత్యానికి ఆపిల్ చెక్ .. భారత్ లోనూ

డ్రాగన్‌ ఆధిపత్యానికి చెక్‌ పెట్టే దిశగా టెక్‌ దిగ్గజం ఆపిల్‌ అడుగులేస్తున్నది. వచ్చే నెలలో మార్కెట్‌లోకి తీసుకురానున్న ఐ-ఫోన్‌ 14 ఫోన్‌ను చైనాతో పాటు భారత్‌లోనూ ఉత్పత్తి చేయాలని ఆపిల్‌ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఇటీవల భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాపై ఆధారపడటం తగ్గించుకోవాలని ఆపిల్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఆపిల్‌ ఐ-ఫోన్‌ 14 సిరీస్‌లో ఐ-ఫోన్‌ 14, ఐఫోన్‌ మ్యాక్స్‌, ఐఫోన్‌-14 ప్రో మ్యాక్స్‌ ఫోన్లను భారత్‌లోనూ ఉత్పత్తి చేయనున్నది. చైనాతో పాటు భారత్‌లో ఐఫోన్‌ ఉత్పత్తిదారు ఫాక్స్‌కాన్‌ ఐఫోన్‌-14 సిరీస్‌ ఫోన్ల ఉత్పత్తి ప్రారంభించనున్నదని సమాచారం.

 

Tags :