ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆరిఫ్ మొహమ్మద్?

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆరిఫ్ మొహమ్మద్?

16వ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరుగుతుంది. నామినేషన్లకు ఆఖరు తేదీ ఈ  నెల 19. అయితే ఇంతవరకు ఎన్‌డీఏ ప్రభుత్వం కానీ, విపక్షాలు కానీ అభ్యర్థిని పోటీకి ఎంపిక చేయలేదు. అయితే కొంతమంది అభ్యర్థులపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ ఎన్‌డిఏ అభ్యర్థిగా మొదటి స్థానంలో ఉన్నట్లు బిజేపీ వర్గాల ద్వారా తెలిసింది.  ప్రస్తుతం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మరోసారి ఉపరాష్ట్రపతిగా కొనసాగిస్తే తన మిషన్‌ సౌత్‌ లక్ష్యానికి సహాయంగా ఉంటుందని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్తర్‌ అబ్బాస్‌ నక్వీ పేరు కూడా ప్రచారంలో ఉన్నప్పటికీ ఆయన బహుశా జమ్ముకశ్మీర్‌కు లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియామకం కావచ్చు.

 

Tags :