విశ్వ‌క్ సేన్ ను డైరెక్ట్ చేయబోతున్నయాక్షన్ హీరో

విశ్వ‌క్ సేన్ ను డైరెక్ట్ చేయబోతున్నయాక్షన్ హీరో

తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్న సీనియ‌ర్ స్టార్ అర్జున్ స‌ర్జా త్వ‌ర‌లోనే తెలుగులో డైరెక్ట్ చేయ‌బోతున్నారు. ఆయ‌న మెగా ఫోన్ ప‌ట్టి నాలుగేళ్లు అవుతుంది. ఈ గ్యాప్ త‌ర్వాత అర్జున్ డైరెక్ట్ చేయ‌బోతున్న సినిమాలో విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి కుర్ర హీరో విశ్వ‌క్‌ను అర్జున్ స‌ర్జా ఎలా ప్రెజెంట్ చేయ‌బోతున్నార‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తిని రేపుతోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన వివరాలు వెల్లడవుతాయని సినీ సర్కిల్స్‌ సమాచారం. ఓ సీనియ‌ర్ స్టార్ హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయ‌న ద‌ర్శ‌కుడిగా చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఆయ‌నకు డైరెక్ష‌న్ కంటే యాక్ట‌ర్‌గానే మంచి గుర్తింపు ఉంది. నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ స‌ద‌రు స్టార్ క‌మ్ డైరెక్ట‌ర్ మెగా ఫోన్ ప‌ట్ట‌డానికి రెడీ అయ్యారు.

డిఫ‌రెంట్ క‌థ‌, క‌థాంశంతో విశ్వ‌క్ సేన్ కోసం అర్జున్ ఓ క‌థ‌ను సిద్ధం చేసి వినిపించార‌ట. విశ్వ‌క్‌కి కూడా న‌చ్చింద‌ని, ఆయ‌న కూడా యాక్ట్ చేయ‌డానికి ఓకే చెప్పార‌నేది స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని టాక్‌. అయితే ఇప్ప‌టికే విశ్వ‌క్ సేన్ హీరోగా చాలా బిజీగా ఉన్నారు. త‌ను యాక్ట్ చేసిన ఓరి దేవుడా సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. అది కాకుండా ద‌మ్కీ, స్టూడెంట్స్ జిందాబాద్ వంటి సినిమాలు చేస్తున్నారు విశ్వ‌క్ సేన్‌. మ‌రి అర్జున్ త‌న సినిమాలో విశ్వ‌క్ సేన్‌ను ఎలా చూపిస్తార‌నేది కూడా ఇంట్రెస్టింగ్ పాయింటే.ఇక విశ్వ‌క్ సేన్ విష‌యానికి వ‌స్తే త‌ను డిఫ‌రెంట్‌గా చేసిన రీసెంట్ మూవీ అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం సినిమా మంచి రెవిన్యూ వచ్చినా టాక్ డివైడ్ అయ్యింది.  

టి వి 9 ఛానెల్‌లో జ‌రిగిన గొడ‌వ‌తో విశ్వ‌క్ సేన్ కాంట్ర‌వ‌ర్సీలో నిలిచారు. ఆ త‌ర్వాత రిలీజైన ఈ సినిమా ఓకే అనిపించుకుంది. అలాగే అర్జున్ రీసెంట్‌గా ఖిలాడి సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్‌గా నటించిన సంగ‌తి తెలిసిందే. ఇది కాకుండా క‌న్న‌డ‌, మల‌యాళం, త‌మిళ భాష‌ల్లో సినిమాలు చేస్తున్నారు. క‌థానాయ‌కుడిగానే కాకుండా స‌బ్జెక్ట్ డిమాండ్ చేస్తే ప్ర‌తినాయ‌కుడిగానూ ప‌లు చిత్రాల్లో మెప్పించారు. ఒక‌వైపు అర్జున్‌.. మ‌రో వైపు విశ్వ‌క్ సేన్ వంటి డిఫ‌రెంట్ కాంబో మూవీ ఎలా ఉండ‌బోతుంది.. ఇందులో నిజా నిజాలేంటి? అనే విష‌యాలు తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

 

 

Tags :