MKOne TeluguTimes-Youtube-Channel

సుప్రీంకోర్టులో కవితకు షాక్.. 20న అరెస్టు ఖాయమా..?

సుప్రీంకోర్టులో కవితకు షాక్.. 20న అరెస్టు ఖాయమా..?

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత వైపే అందరి చూపులూ ఉన్నాయి. ఈడీ, సుప్రీంకోర్టు మధ్య కవిత చక్కర్లు కొడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో అని అందరూ ఎదురు చూశారు. అయితే సుప్రీంకోర్టు నుంచి కవితకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తన పిటిషన్ ను త్వరగా విచారించాలన్న కవిత విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చంది. దీంతో ఈడీకి మార్గం సుగమం అయింది.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. రామచంద్ర పిళ్లై అరెస్టు తర్వాత సౌత్ గ్రూపుపై ఈడీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఎమ్మెల్సీ కవిత కూడా సౌత్ గ్రూపులో భాగమేనని ఈడీ గుర్తించింది. కవిత తరపున వ్యవహారాలన్నింటినీ రామచంద్ర పిళ్లై చక్కబెట్టినట్లు తేల్చింది. రామచంద్ర పిళ్లై కూడా ఈ విషయాలను అంగీకరించారని ఈడీ ఛార్జ్ షీటులో పేర్కొంది. దీంతో కవితను విచారణకు పిలిచింది ఈడీ. 11న తొలిసారి ఈడీ విచారణకు హాజరైంది కవిత.

వాస్తవానికి 11నే కవితను ఈడీ అరెస్టు చేస్తుందని జోరుగా ప్రచారం సాగంది. అయితే ఆరోజు ఆమె ఫోన్ ను మాత్రం ఈడీ స్వాధీనం చేసుకుంది. 16న మరోసారి విచారణకు రావాలని కోరింది. అయితే 16న కవిత ఈడీ విచారణకు హాజరు కాలేదు. తాను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణలో ఉన్నందున అంతవరకూ విచారణ వాయిదా వేయాలని కవిత ఈడీకి లేఖ రాశారు. అయితే 20న విచారణకు రావాలంటూ ఈడీ మరోసారి కవితకు నోటీసులు పంపించింది.

ఇంతలో సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ముందుగా చెప్పినట్లు కవిత పిటిషన్ పై విచారణ 24నే జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో కవిత 20న విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు విచారణకు హాజరైతే కవిత అరెస్టు ఖాయమని జోరుగా ఉహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు సౌత్ గ్రూపులో మరో కీలక వ్యక్తి ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి. అయనకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. 

 

 

Tags :