MKOne Telugu Times Youtube Channel

రేపు మళ్లీ కవిత విచారణ..! ఇవాళ వదిలిపెట్టిన ఈడి..!!

రేపు మళ్లీ కవిత విచారణ..! ఇవాళ వదిలిపెట్టిన ఈడి..!!

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఇవాళ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు కవిత విచారణ కొనసాగింది. ఉదయం 11 గంటల సమయంలో ఢిల్లీలోని ఈ డి ఆఫీస్ కి వెళ్ళిన కవిత రాత్రి 9:30 గంటల వరకు అక్కడే ఉంది. ఎన్ని గంటలసేపు విచారణ కొనసాగిస్తూ ఉండడంతో టిఆర్ఎస్ శ్రేణుల్లో గంట గంటకు ఉత్కంఠ పెరిగిపోయింది. కవితను అరెస్టు చేస్తారేమో అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అరెస్టు చేసేందుకు ఎన్ని గంటల సేపు పెట్టారేమో అని సందేహించారు.

అయితే ఎవరు ఊహించని విధంగా కవితను ఎన్నర గంటల సమయంలో ఈడి వదిలిపెట్టింది. అయితే 24వ తేదీ విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చినట్టు వార్త బయటకు వచ్చింది. కానీ అది నిజం కాదని తర్వాత తేలింది. కవితను రేపే అంటే మంగళవారం మరోసారి విచారణకు రావాలని ఈడి స్పష్టం చేసింది. రేపు ఉదయం 11 గంటల సమయంలో విచారణకు రావాలని కవితకు నోటీసులు ఇచ్చినట్లు తేలింది. ముందుగా అందరూ 24నే కవితను మళ్ళీ విచారణకు రావాలని ఈడి ఆదేశించినట్లు అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో కవితను రేపే విచారణకు రావాలని కోరడంతో బి ఆర్ ఎస్ శ్రేణులు మళ్లీ ఆందోళనకు గురయ్యాయి.

మొత్తానికి కవిత అరెస్టు ఇవాళ కాయమేమోనని అందరూ భావించిన సమయంలో అనూహ్యంగా ఆమెను వదిలిపెట్టడం టిఆర్ఎస్ శ్రేణులను సంతోషానికి గురి చేసింది. అయితే రేపే మళ్ళీ విచారణకు పిలవడంతో ఆందోళన కూడా కలుగుతుంది. మరి రేపటి విచారణ తర్వాత కవితను అరెస్టు చేస్తారా లేకుంటే ఇవాల్టి లాగే వదిలిపెడతారా అనేది తెలియాల్సి ఉంది.

 

 

Tags :