ఇందుకు కదా... పవన్ కల్యాణ్ అంటే పిచ్చి..!

ఇందుకు కదా... పవన్ కల్యాణ్ అంటే పిచ్చి..!

పవన్ కల్యాణ్ గురించి ఇంట్రో ఇవ్వాల్సిన అవసరం లేదు. జగమెరిగిన హీరో.. తెరపై పవర్ స్టార్.! కానీ పవర్ కోసం చాలా కాలంగా ఎంతో ప్రయత్నిస్తున్నారు కానీ వర్కవుట్ కావట్లేదు. ఆయన ఏది చేసినా ఎంతో పట్టుదలతో చేస్తారని ఆయన సన్నిహితులు పదే పదే చెప్తుంటారు. పవన్ కల్యాణ్ కూడా అలా చేస్తున్నట్టే కనిపిస్తుంటారు. సినిమాల్లో ఉన్నప్పుడు పూర్తిగా వాటిపైనే మనసు పెడుతుంటారు. అలాగే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోతుంటారు. ఆయా సందర్భాల్లో ఆయన మాట్లాడే మాటలు కూడా మనసు లోతుల్లోంచి వస్తుంటాయి. ఆయన మాట్లాడుతుంటే ప్రేక్షకులు కేరింతలు కొట్టేది కూడా ఇందుకే. ఆయన మాటలు అంతగా ఆకట్టుకుంటూ ఉంటాయి జనాలను. ఇవాళ కూడా పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు అలాగే ఉన్నాయి. పవన్ మాటలు విన్నవాళ్లంతా ఇందుకే కదా .. పవన్ కల్యాణ్ అంటే పిచ్చిగా ఇష్టపడేది.. అని అనుకుంటున్నారు.. ఇంతకూ పవన్ కల్యాణ్ ఏమన్నారు..?

హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా సదస్సులో ఫేసింగ్ ది ఫ్యూచర్ అనే అంశంపై పవన్ కల్యాణ్ స్పీకర్ గా అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. “రాజకీయాల్లో తాను ఫెయిల్యూర్ అని .. ఓడిపోయానని చెప్పుకోవడానికి తాను ఏమాత్రం మొహమాట పడనని“ చెప్పారు. నా ఫెయిల్యూర్ గురించి నిర్భయంగా మాట్లాడతా.. ఫెయిల్యూర్ లోనే సక్సెస్ ఉంది. డబ్బున్న వాళ్లంతా గొప్పోళ్లని.. పేరున్నవాళ్లంతా మహానుభావులని.. అనుకోవద్దని పవన్ అన్నారు. ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మొద్దు.. దేవుడిని కూడా.. ఏది తప్పు.. ఏది ఒప్పు అనేది నిర్ణయించుకోవాలి.. మన వ్యక్తిగత విజయమే దేశానికి పెట్టుబడి..” అన్నారు పవన్ కల్యాణ్.

వాస్తవాలను యాక్సెప్ట్ చేయడంలో పవన్ కల్యాణ్ ముందుంటారు. తాను చేసిన తప్పులను సందర్భం వచ్చినప్పుడు కచ్చితంగా ఒప్పుకుంటూ ఉంటారు. నిర్మొహమాటంగా ఎలాంటి భేషజాలు లేకుండా అలాంటివాటిని అంగీకరిస్తుంటారు. తనను ఒక స్టార్ హీరోలాగా కాకుండా.. సామాన్యులలో ఒకడిగా భావిస్తూ.. వాళ్లలో కలిసిపోతుంటారు. వాళ్ల సమస్యలను తన సమస్యలుగా ఫీలై రెస్పాండ్ అవుతుంటారు. అందుకే ఆయన్ను కలిసేందుకు జనం ఎగబడుతుంటారు. తనలోని భోళాతనమే తనను ఇంతటి స్టార్ ను చేసింది. సినిమాల్లో లాగే పాలిటిక్స్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా ఏళ్లుగా ఎంతో శ్రమిస్తున్నారు. కానీ పాలిటిక్స్ లో ఆయన టైమ్ అస్సలు బాగలేదు. గత ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. రాజకీయాల్లో గెలుపే ప్రతీక. కానీ మొదటి అడుగులోనే పవన్ కల్యాణ్ చతికిలపడ్డారు. ఇప్పుడు ఆ విషయాన్ని నిర్మొహమాటంగా అంగీకరించారు.

పవన్ కల్యాణ్ చెప్పినట్టు ఫెయిల్యూర్స్ ప్రతి ఒక్కరికీ వస్తూనే ఉంటాయి. వాటిని విజయాలుగా మలుచుకున్నప్పుడే ఆ జీవితానికి నిజమైన అర్థం. ఇప్పుడు పవన్ కల్యాణ్ చెప్పింది కూడా ఇదే. తనకు సినిమాల్లో ఎన్నో ఫ్లాపులు వచ్చాయి. వాటికి కుంగిపోలేదు. ఆ తర్వాత ఎన్నో హిట్లు సాధించారు. ఇప్పుడు పాలిటిక్స్ లో ప్రయాణం కూడా ఫెయిల్యూర్స్ తోనే ప్రారంభమైంది. దాన్ని విజయతీరాలకు చేర్చుకునేందుకు.. తాను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా వాస్తవాలను యాక్సెప్ట్ చేసిన వాళ్లే నిజమైన హీరోలు. ఫెయిల్యూర్స్ ను సక్సెస్ గా మలుచుకున్న వాళ్లే స్ఫూర్తిప్రదాతలు.

 

Tags :