ఎలక్షన్ కమీషనర్‌గా అరుణ్ గోయల్ బాధ్యతల స్వీకరణ

ఎలక్షన్  కమీషనర్‌గా అరుణ్ గోయల్ బాధ్యతల స్వీకరణ

భారత ఎలక్షన్‌ కమీషనర్‌గా అరుణ్‌ గోయల్‌ బాధ్యతలు స్వీకరించారు. రెండు రోజుల క్రితం ఆయనకు కొత్త అపాయిట్మెంట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. భారత ఎన్నికల కమిషనలో ముగ్గురు కమీషనర్లు ఉంటారు. అయితే మే నెలలో సునీల్‌ చంద్ర రిటైర్‌ కావడంతో  ఓ పోస్టు ఖాలీగా ఉంది. సీఈసీగా రాజీవ్‌ కుమార్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనుప్‌ చంద్ర పాండే మరో కమీషనర్‌గా ఉన్నారు.  అరుణ్‌ గోయల్‌ది 1985వ బ్యాచ్‌. పంజాబ్‌ క్యాడర్‌కు చెందిన ఐఏస్‌ ఆఫీసర్‌ ఆయన. డిసెంబర్‌ 31వ తేదీన ఆయన రిటైర్‌ కావాల్సి ఉంది. కానీ నవంబర్‌ 18వ తేదీన ఆయన స్వచ్ఛంద  విరమణ చేశారు.  2025 ఫిబ్రవరిలో రాజీవ్‌ కుమార్‌ పదవీకాలం ముగిసిన తర్వాత సీఈసీగా గోయల్‌ బాద్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.

 

Tags :
ii). Please add in the header part of the home page.