వినాయక చవితి సందర్భంగా 'ఏనుగు' ఫస్ట్ లుక్ విడుదల

వినాయక చవితి సందర్భంగా 'ఏనుగు' ఫస్ట్ లుక్ విడుదల

సింగం సిరీస్‍ చిత్రాలతో అటు తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకీ దగ్గరయ్యారు దర్శకుడు హరి. ఇప్పుడాయన దర్శకత్వంలో అరుణ్‍ విజయ్‍ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. వెడిక్కారన్‍పట్టి ఎస్‍ శక్తివేల్‍ నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ ద్విభాషా చిత్రానికి ఏనుగు అనే టైటిల్‍ ఖరారు చేశారు. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్లుక్‍ విడుదల చేశారు. ఈ పోస్టర్‍లో విజయ్‍  వినాయకుడి విగ్రహాన్ని పట్టుకుని,  సీరియస్‍గా నడిచొస్తూ కనిపించారు. మాస్‍, యాక్షన్‍ డ్రామాగా రూపొందుతోన్న చిత్రమిది. భారీ పోరాట ఘట్టాలున్నాయి. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది అని చిత్రబృందం తెలియజేసింది. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్‍, సముద్రఖని, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్‍ స్వరాలందిస్తున్నారు.

 

Tags :